News March 29, 2024

ఓటు వేయకపోతే రూ.350 ఫైన్.. నిజమేనా?

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని ఓటర్లకు ఎన్నికల సంఘం ఫైన్ వేస్తుంది. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350లను డెబిట్ చేస్తుంది’ అని మెసేజ్ సారాంశం. దీనిపై కేంద్రానికి సంబంధించిన PIB FACTCHECK స్పందించింది. ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను నమ్మొద్దని పేర్కొంది.

Similar News

News April 10, 2026

‘జననాయగన్’ లీక్: డౌన్‌లోడ్ చేసుకుంటే..

image

విజయ్ ఆఖరి సినిమా ‘జననాయగన్’ థియేటర్లలో రిలీజ్ కాకముందే ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది. గురువారం రాత్రి కొన్ని క్లిప్స్ బయటకు రాగా శుక్రవారం కల్లా ఫుల్ సినిమా పైరసీ సైట్లలో ప్రత్యక్షమైంది. దీనిపై ప్రొడక్షన్ హౌస్ KVN లీగల్ టీమ్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. వీడియోలు షేర్ చేసినా, డౌన్లోడ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News April 10, 2026

ఇజ్రాయెల్‌ ఫైర్.. పోస్ట్ డిలీట్ చేసిన పాక్ మంత్రి

image

ఇజ్రాయెల్‌ ‘మానవాళికి శాపం’ అని, లెబనాన్‌లో ‘నరమేధం’ సృష్టిస్తోందంటూ పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీస్ తీవ్రంగా స్పందించింది. శాంతి చర్చల్లో మధ్యవర్తిగా ఉంటూ ఇజ్రాయెల్ అంతాన్ని కోరడం ఏంటని మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలను అస్సలు సహించబోమని గట్టిగా హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన ఖవాజా తన ‘X’ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేశారు.

News April 10, 2026

పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.