News September 6, 2025
నిరుద్యోగులకు నెలకు రూ.3,500.. కేంద్రం ఏమందంటే?

దేశంలోని అర్హులైన నిరుద్యోగులందరికీ కేంద్రం నెలకు రూ.3,500 ఆర్థిక సాయం చేయనుందని, అప్లై చేసుకునే విధానం ఇదేనంటూ కొందరు యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి స్కీమ్‌లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని PIB FactCheck వెల్లడించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఇలాంటి పథకాలుంటే ప్రభుత్వమే ప్రకటిస్తుందని పేర్కొంది.
Similar News
News September 6, 2025
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం అప్డేట్స్

* ఇప్పటివరకు 2,54,685 వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి
* హుస్సేన్ సాగర్ వద్ద అట్టహాసంగా సాగుతున్న ప్రక్రియ. గంగమ్మ ఒడికి చేరిన 10వేల విగ్రహాలు
* మరో 4,500 పెద్ద విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందన్న సీపీ సీవీ ఆనంద్
* నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు తెల్లవారుజాము 4.40 గంటల వరకు నడవనున్న MMTS రైళ్లు
News September 6, 2025
చరిత్ర సృష్టించిన సికందర్ రజా

జింబాబ్వే క్రికెటర్ సికందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మాట్(టెస్టులు ఆడే దేశాలు)లో అత్యధిక POTMలు అందుకున్న ప్లేయర్‌గా రజా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆయన POTMగా నిలిచి ఈ ఫీట్ సాధించారు. రజా తర్వాత కోహ్లీ, సూర్యకుమార్(16), మహమ్మద్ నబీ, రోహిత్(14), మహ్మద్ రిజ్వాన్, వార్నర్, మ్యాక్స్‌వెల్ (12) ఉన్నారు.
News September 6, 2025
SBIలో 6,589 జాబ్స్.. పరీక్షల తేదీ ప్రకటన

6,589 క్లర్క్(జూనియర్ అసోసియేట్స్) పోస్టుల భర్తీకి ఈనెల 20, 21, 27 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు SBI ప్రకటించింది. త్వరలో కాల్ లెటర్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా AUG 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం పోస్టుల్లో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలున్నాయి. వీటిలో APలో 310, TGలో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెబ్‌సైట్: <