News October 31, 2024

రూ.4.2L Cr ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే లక్ష్యం

image

AP: రాష్ట్రంలో 2024-29కుగాను ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.Oకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగంలో ఆధునిక సాంకేతికతతోపాటు పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తామని తెలిపింది. 2029 నాటికి రూ.4.2 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీనే లక్ష్యమని వెల్లడించింది.

Similar News

News October 21, 2025

అక్టోబర్ 21: చరిత్రలో ఈరోజు

image

1833: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జననం(ఫొటోలో-R)
1947: ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం
1967: అథ్లెట్ అశ్వినీ నాచప్ప జననం
1986: సినీ దర్శకుడు టి.కృష్ణ మరణం(ఫొటోలో-L)
1992: హీరోయిన్ శ్రీనిధి శెట్టి జననం
1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం
✦పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

News October 21, 2025

ఉద్యోగి ఆత్మహత్య.. వేధింపులపై ఫిర్యాదు చేయలేదు: ఓలా ప్రతినిధి

image

OLA ఉద్యోగి <<18058963>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై ఆ సంస్థ ప్రతినిధి స్పందించారు. అరవింద్ మూడున్నరేళ్లుగా తమ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని, ఆ సమయంలో వేధింపుల గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అరవింద్ కుటుంబానికి తక్షణమే అండగా నిలిచేందుకు ఫైనల్ సెటిల్‌మెంట్ డబ్బులు బ్యాంకు అకౌంట్లో వేశామని స్పష్టతనిచ్చారు. CEO భవీశ్‌పై నమోదైన కేసును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.

News October 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.