News August 20, 2024
7 గంటలు నడిస్తే గంటకు రూ.4వేలు: టెస్లా

గంటల తరబడి నడిచేందుకు ఆసక్తిగా ఉన్నవారికి వాహన తయారీ సంస్థ టెస్లా వినూత్న ఆఫర్ ప్రకటించింది. తమ వద్ద 7 గంటల పాటు నడిస్తే గంటకు రూ.4వేలు(రోజుకు రూ.28వేలు) ఇస్తామని వెల్లడించింది. అచ్చం మనిషిని పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోట్‌ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఈక్రమంలో మోషన్-క్యాప్చా సాంకేతికత సాయంతో దానికి శిక్షణ ఇచ్చేందుకు వారిని వినియోగించుకోవాలని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 28, 2025
నేడు అఖండ-2 ప్రీరిలీజ్ ఈవెంట్

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా, మూవీ టీం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇవాళ HYDలోని కూకట్‌పల్లిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘అఖండ’ చిత్రం ఉత్తరాదిలోనూ మంచి విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై హిందీ రాష్ట్రాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
News November 28, 2025
కాశీకి వెళ్లలేకపోయినా.. ఈ శివాలయాలకు వెళ్లవచ్చు

మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా కాశీ వెళ్లి తీరాలని మన శాస్త్రాలు చెబుతాయి. అయితే కాశీ వెళ్లడం సాధ్యం కానప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదని పండితులు అంటున్నారు. కాశీతో సమానమైన శక్తి ఉన్న 4 కాశీ క్షేత్రాలు ఉన్నాయంటున్నారు. వీటిలో ఏ క్షేత్రాన్ని దర్శించినా కాశీ యాత్ర ఫలం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 1. కేదార క్షేత్రం 2. శ్రీశైలం 3. శ్రీకాళహస్తి 4. పట్టిసము (పట్టిసీమ).
News November 28, 2025
నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.


