News April 4, 2025

రూ.4,00,000 సాయం.. కీలక ప్రకటన

image

TG: రాజీవ్ యువ వికాసం <<15922104>>దరఖాస్తులపై <<>>BC కార్పొరేషన్ స్పష్టత ఇచ్చింది. దరఖాస్తుదారుల వద్ద రేషన్‌కార్డు ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, రేషన్‌కార్డు లేకుంటే ఇన్‌కమ్ సర్టిఫికెట్‌తో <>దరఖాస్తు<<>> చేసుకోవచ్చంది. 2016 తర్వాత తీసుకున్న కాస్ట్ సర్టిఫికెట్ చాలని, దరఖాస్తులను మండల/మున్సిపల్ ఆఫీసుల్లో ఈ నెల 14లోగా ఇవ్వాలని సూచించింది. రూ.4లక్షల వరకు సాయం అందించే ఈ స్కీంకు ఇప్పటివరకు 7 లక్షల మంది అప్లై చేశారు.

Similar News

News November 23, 2025

మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు

image

ప్రేమ, తృప్తి, త్యాగం, నిగ్రహం.. ఈ సత్కర్మలే మనిషిని జీవింపజేస్తాయి. మంచి మనిషి అనే పేరు తెస్తాయి. అసూయ, అత్యాశ, ద్వేషం, పగ వంటి దుష్కర్మలు మనిషిని దహింపజేస్తాయి. ఇవి ఉన్న మనిషి బతికున్న శవం వంటివాడు. అధికారం, అహంకారం, ఆనాలోచనలు జీవితానికి చెరుపు తెస్తాయి. అప్పు, యాచన ఎప్పుడూ చేయకూడదు. లక్ష్యం, సహనం, వినయం, విధేయత వంటి సద్గుణాలతో జీవించి, వ్యామోహం, స్వార్థం వదిలితేనే ఉత్తమ కర్మఫలాన్ని పొందుతాం.

News November 23, 2025

‘పీస్ ప్లాన్’ ఫైనల్ ఆఫర్ కాదు: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఏదో ఒక విధంగా ముగించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధం మొదలైన సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వార్ జరిగేది కాదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు తాము ప్రతిపాదించిన 28 పేజీల <<18355334>>పీస్ ప్లాన్<<>> ఫైనల్ ఆఫర్ కాదని స్పష్టం చేశారు. కాగా US ప్రతిపాదించిన ప్లాన్ రష్యాకు మేలు చేసేలా, ఆ దేశం అడిగినవన్నీ జరిగేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News November 23, 2025

కల్కి ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు?

image

విష్ణువు ‘కల్కి’ అవతారంలో కలియుగం చివరిలో అవతరిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఈ కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యుగంలో ఇప్పటికే దాదాపు 5 వేల సంవత్సరాలు పూర్తయ్యాయి. కల్కి అవతారం సుమారు 4,27,000 సంవత్సరాల తర్వాత వస్తాడని కొందరు నమ్ముతారు. UPలోని శంభల గ్రామంలో జన్మిస్తాడని భవిష్యవాణిలో ఉంది. ధర్మ సంస్థాపన కోసం తన ఖడ్గంతో అందరికీ సమాధానం చెబుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి.