News March 26, 2025

PM కిసాన్ అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ: కేంద్రం

image

పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిపొందిన అనర్హుల నుంచి ఇప్పటివరకు రూ.416 కోట్లు తిరిగి వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో వెల్లడించారు. ఈ స్కీమ్‌లో భాగంగా ఇప్పటివరకు 19 విడతల్లో రూ.3.68 కోట్లకు పైగా రైతులకు అందించినట్లు తెలిపారు. ఆధార్, ఐటీ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను ఏరివేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 27, 2025

శుభ ముహూర్తం (27-03-2025)

image

☛ తిథి: బహుళ త్రయోదశి రా.9.02 వరకు తదుపరి చతుర్దశి
☛ నక్షత్రం: శతభిషం రా.10.58 వరకు తదుపరి పూర్వాభాద్ర
☛ శుభ సమయం: ఉ.10.53-11.29, సా.5.53-6.41
☛ రాహుకాలం: మ.1.30-మ.3.00
☛ యమగండం: ఉ.6.00-ఉ.7.30
☛ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
☛ వర్జ్యం: ఉ.6.48-ఉ.8.19
☛ అమృత ఘడియలు: సా.4.02-సా.5.33

News March 27, 2025

క్రమశిక్షణ కమిటీని నియమించిన వైసీపీ

image

AP: ఐదుగురు సభ్యులతో వైసీపీ క్రమశిక్షణ కమిటీని ఆ పార్టీ చీఫ్ జగన్ నియమించారు. ఈ కమిటీకి శెట్టిపల్లి రఘురామిరెడ్డిని ఛైర్మన్‌గా, సభ్యులుగా తానేటి వనిత, కైలే అనిల్ కుమార్, వై.విశ్వేశ్వర రెడ్డి ఉండనున్నారు. అలాగే వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షులుగా కాకుమాను రాజశేఖర్‌ను నియమించినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.

News March 27, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* TG:బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారంపై సిట్ ఏర్పాటుకు నిర్ణయం
* రాష్ట్రంలో ఉపఎన్నికలు రావు: రేవంత్
* SLBCని పూర్తి చేసి తీరుతాం: మంత్రి ఉత్తమ్
* రేవంత్ సీఎం అని మర్చిపోతున్నారు: KTR
* AP: తలసరి ఆదాయంలో విశాఖ ఫస్ట్.. శ్రీకాకుళం లాస్ట్: CBN
* ఈ నెల 31లోపు సిలిండర్ బుక్ చేసుకోండి: నాదెండ్ల

error: Content is protected !!