News July 25, 2024

రూ.48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా?: విజయసాయిరెడ్డి

image

ఏపీ కోసమే ఎన్డీఏ బడ్జెట్ కేటాయించినట్లు గొప్పలు చెప్పుకోవడం దారుణమని YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. ‘బడ్జెట్‌లోని మొత్తం రూ.48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా? ఆ రాష్ట్రానికే మొత్తం నిధులు ఇచ్చినట్లు ఇండియా కూటమి ఏడుస్తోంది. రూ.15 వేల కోట్లు ఏపీకి అప్పుగా మాత్రమే ఇచ్చింది. ఆ అసలు, వడ్డీని ఆ రాష్ట్ర ప్రజలే తిరిగి కట్టాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News November 3, 2025

WWC-2025 ‘లీడింగ్’ రికార్డులు

image

☞ అత్యధిక వికెట్లు-22(దీప్తి శర్మ-భారత్)
☞ సిక్సర్లు- 12(రిచా ఘోష్-భారత్)
☞ పరుగులు- 571(లారా-దక్షిణాఫ్రికా)
☞ వ్యక్తిగత స్కోరు- 169(లారా)
☞ సెంచరీలు-2(లారా, గార్డ్‌నర్, హేలీ)
☞ అర్ధసెంచరీలు-3(లారా, దీప్తి శర్మ)
☞ అత్యధిక ఫోర్లు-73(లారా)
☞ ఈ టోర్నీలో భారత్ తరఫున మంధాన, ప్రతీకా, రోడ్రిగ్స్ సెంచరీలు చేశారు.

News November 3, 2025

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

image

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మొదట ములకలచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే జనార్దన్ రావుకు సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తొలుత ములకలచెరువు, ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యంపై హడావుడి చేశారని వివరించారు.

News November 3, 2025

పాపికొండల బోటింగ్ షురూ

image

AP: పాపికొండల బోటింగ్ మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ వద్ద నిన్న రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటులో షికారుకెళ్లారు. వాస్తవానికి దీపావళికి ముందే ఈ బోటింగ్ ప్రారంభమైనప్పటికీ భారీ వర్షాలు, వరదలతో నిలిచిపోయింది. తాజాగా సాధారణ వాతావరణం ఉండటంతో అధికారులు అనుమతిచ్చారు. కార్తీక మాసం కావడంతో తిరిగి పర్యాటకుల తాకిడి పెరగనుంది.