News July 19, 2024
రొట్టెల పండుగ నిర్వహణకు రూ.5కోట్లు: CBN

AP: ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా బారాషహీద్‌లో మూడో రోజు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పండుగ నిర్వహణకు ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News December 7, 2025
కోర్ సబ్జెక్ట్ లేదని అనర్హులుగా ప్రకటించలేం: సుప్రీం

అభ్యర్థి PGలో కోర్ సబ్జెక్ట్ లేదని అతడిని అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2013లో మానిటరింగ్, ఎవాల్యుయేషన్ కన్సల్టెంట్‌గా ఓ అభ్యర్థి(M.Com) ఎంపికయ్యారు. కానీ స్టాటిస్టిక్స్‌లో PG లేదని అతడిని ప్రభుత్వం తొలగించింది. దీంతో బాధితుడు SCని ఆశ్రయించారు. జాబ్‌కు కావాల్సిన ప్రధాన సబ్జెక్టు అభ్యర్థి చదివాడని, అతడి PG వేరే స్పెషలైజేషన్‌లో ఉందని తిరస్కరించలేమని SC స్పష్టం చేసింది.
News December 7, 2025
భారీ జీతంతో రైట్స్‌లో ఉద్యోగాలు..

<
News December 7, 2025
ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో

ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 100 దాకా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. అయితే ఆదివారం కావడంతో రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది.


