News November 2, 2024

సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు: మంత్రి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేశాం. మొత్తం 4 దశల్లో ఇళ్లు కేటాయిస్తాం. మొదటిదశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తాం. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తాం. 400 చ.అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుంది. సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు దశల వారీగా ఇస్తాం. ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తాం’ అని ఆయన వెల్లడించారు.

Similar News

News December 9, 2025

హైదరాబాద్‌లోని NI-MSMEలో ఉద్యోగాలు..

image

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్‌(NI-<>MSME<<>>)లో 3 అసోసియేట్ ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ME, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.nimsme.gov.in

News December 9, 2025

శోకం నుంచి శక్తిగా.. సోనియా ప్రస్థానం!

image

నేడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు. భర్త రాజీవ్ గాంధీ మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టి పురుషుల ఆధిపత్యం ఉన్న రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని అకుంఠిత దీక్షతో మళ్లీ అధికారంలోకి తెచ్చారు. పాలనలో తనదైన ముద్ర వేసి సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2009లో ఇదే రోజున తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ ఆమె రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించారు.

News December 9, 2025

మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే!

image

అందంగా కనిపించాలని అమ్మాయిలు ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. ఇలా కాకుండా కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే సహజంగానే మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. హెల్తీ ఫుడ్, తగినంత నిద్ర, మంచినీళ్లు తాగడం, సంతోషంగా ఉండటం వల్ల సహజంగా అందం పెరుగుతుందంటున్నారు. దీంతో పాటు బేసిక్ స్కిన్ కేర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలని చెబుతున్నారు.