News January 12, 2025
కుక్క బర్త్ డే కోసం రూ.5లక్షలు ఖర్చు!
పెంపుడు కుక్కలను సొంత పిల్లల్లాగా చూసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కొందరు వాటికి పుట్టినరోజులు, సీమంతాలు కూడా చేస్తుంటారు. తాజాగా ఝార్ఖండ్‌కు చెందిన సప్నా అనే మహిళ తన కుక్క బర్త్ డే కోసం రూ.5 లక్షలు ఖర్చు చేసి వార్తల్లో నిలిచారు. వేడుక కోసం రూ.40వేల ఖరీదైన స్పెషల్ కేక్‌ను ఏర్పాటు చేయగా 300 మందికి ఆతిథ్యాన్ని అందించడం విశేషం.
Similar News
News January 12, 2025
అవార్డుల్లో, అమ్మకాల్లో ఇండియన్ విస్కీలు అదుర్స్!
ఆల్కహాల్ పానీయాల మార్కెట్లో ఆదాయ పరంగా ఇండియా ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉంది. ఇండియాలో తయారయ్యే కొన్ని బ్రాండ్లు విదేశాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అందులో మెక్‌డోవెల్స్ విస్కీ ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్లలో ఒకటిగా రికార్డులకెక్కింది. మరో బ్రాండ్ ‘ఇంద్రి సింగిల్ మాల్ట్ విస్కీ’.. అత్యధిక అవార్డులు పొందిన ట్రిపుల్ కాస్క్ సింగిల్ మాల్ట్‌గా నిలిచింది.
News January 12, 2025
టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత.. రాష్ట్రంలో 1,673 ఉద్యోగాలు
TG: హైకోర్టు పరిధిలో 1,673 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కోర్టుల్లో జూనియర్, ఫీల్డ్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 1,277, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వంటి టెక్నికల్ పోస్టులు 184, హైకోర్టులో 212 ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <
News January 12, 2025
ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఏపీ కోసం సంకల్పిద్దాం: సీఎం
AP: తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో జీవితాల్లో వెలుగులు తెచ్చి, తెలుగు జాతిని నంబర్-1 చేసేందుకు స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ఆవిష్కరించామన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు P4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్నర్షిప్) విధానం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇందులో అందరూ భాగస్వాములవ్వాలని, ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఏపీ కోసం సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.