News September 7, 2024
డిగ్రీ చదివిన వారికి నెలకు రూ.5 వేలు.. బ్యాంకుల ఆఫర్!

డిగ్రీ పూర్తి చేసిన 25 ఏళ్లలోపు వయసు గలవారిని బ్యాంకులు త్వరలో అప్రెంటీస్లుగా నియమించుకొని నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇవ్వనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రకటన మేరకు గ్రాడ్యుయేట్స్కు ఇంటర్న్షిప్పై కార్పొరేట్ వ్యవహారాల శాఖ బ్యాంకులతో సమావేశమైంది. మరో నెల రోజుల్లో బ్యాంకులు ఈ నియామకాలు ప్రారంభించవచ్చని ఓ అధికారి తెలిపారు. ఏ బ్యాంకు ఎంత మందికి అవకాశం కల్పిస్తుందో తేలాల్సి ఉంది.
Similar News
News March 11, 2025
FLASH: గ్రూప్-2 ఫలితాలు విడుదల

TG: గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ <
News March 11, 2025
సంతాన ప్రాప్తి కోసం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కత్రినా?

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సందర్శించారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక నాగపూజలో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అయితే, సంతాన ప్రాప్తి కోసం ఈ పూజ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. సర్పాలకు అధిపతి అయిన కార్తికేయుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నారు. సంతాన ప్రాప్తికోసం, ఇతర సర్ప దోషాల నివారణకు అనేకమంది ఇక్కడికి వెళ్తుంటారు.
News March 11, 2025
ఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: చంద్రబాబు

AP: హత్యా రాజకీయాల మరక అంటకుండా 42 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని CM చంద్రబాబు తెలిపారు. నేరాలు – ఘోరాలు చేసి రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కొందరు ఆడబిడ్డలను మాయమాటలతో మోసగిస్తున్నారని, వారి తాటతీస్తామని హెచ్చరించారు. ఆకతాయిలు వేధిస్తుంటే ‘శక్తి’ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైసీపీ తీసుకొచ్చిన దిశ యాప్ దిక్కుమాలిన యాప్ అని మండిపడ్డారు.