News March 11, 2025
నెలకు రూ.5,000.. దరఖాస్తు గడువు పెంపు

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ స్కీమ్ కింద SSC, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు నిరుద్యోగులకు దేశంలోని టాప్-500 కంపెనీల్లో 1yr ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. నెలకు ₹5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద ₹6000 ఇస్తారు. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి ₹8Lలోపు ఉండాలి. దరఖాస్తుకు ఇక్కడ <
Similar News
News October 27, 2025
క్షిపణి పరీక్షలు కాదు.. ముందు యుద్ధం ఆపండి: ట్రంప్

రష్యా <<18109096>>Burevestnik<<>> న్యూక్లియర్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షపై US ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ‘కొత్త న్యూక్లియర్ వెపన్స్‌ను పరీక్షించడంపై కాకుండా ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడంపై మీరు దృష్టి పెట్టండి’ అని సలహా ఇచ్చారు. ఇది ఎలాంటి రక్షణ వలయాన్నైనా ఛేదించుకొని పోగలదని, ప్రపంచంలో ఇలాంటి క్షిపణి వ్యవస్థ మరెవ్వరి దగ్గరా లేదని రష్యా ప్రకటించిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News October 27, 2025
ఘోరం.. నెయ్యి పోసి, సిలిండర్ పేల్చి చంపేసింది

ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సహజీవనం చేస్తున్న రామ్కేశ్(32) తన ప్రైవేటు వీడియోలు ఇవ్వలేదని అమృత(21) బ్రేకప్ చెప్పింది. ఈనెల 6న Ex బాయ్‌ఫ్రెండ్ సుమిత్తో కలిసి రామ్కేశ్ గొంతు కోసి చంపింది. బాడీపై నెయ్యి, వైన్ పోసి గ్యాస్ లీక్ చేసి సిలిండర్‌ను పేల్చింది. ఫోరెన్సిక్ చదువు, క్రైమ్ సిరీస్‌ల తెలివితో అమృత మేనేజ్ చేసినా CCఫుటేజీ, ఫోన్ లొకేషన్‌తో దొరికిపోయింది.
News October 27, 2025
ప్రతిపక్షంలో BRS.. 97.4% తగ్గిపోయిన విరాళాలు

TG: అధికారం కోల్పోగానే BRSకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. ఈసీకి BRS సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25లో రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹5 కోట్లు అందాయి. 2023–24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కారు పార్టీకి రూ.580.52 కోట్లు రాగా ఈసారి ఏకంగా 97.4% తగ్గిపోవడం గమనార్హం.


