News March 18, 2025

చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: సీఎం

image

AP: చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీంతో 93వేల మంది చేనేతకారులకు, 10,534 మరమగ్గాల యజమానులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి ₹50,000 సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే వారికి GST రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో నేతన్నలు వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

Similar News

News February 11, 2026

భీమవరంలో డయాలసిస్ కష్టాలు.. జిల్లా కేంద్రంలోనే లేని వైద్య సేవలు!

image

జిల్లా కేంద్రం భీమవరంలో డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న సెంటర్‌ను తొలగించడంతో చికిత్స కోసం పాలకొల్లు, ఆకివీడు వెళ్లాల్సి వస్తోంది. దూర ప్రయాణం భారమై ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నామని, వెంటనే పట్టణంలో తాత్కాలిక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News February 11, 2026

రూ.55లక్షల తలసరి ఆదాయమే టార్గెట్: గవర్నర్

image

AP: 2047 నాటికి రూ.308లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. రూ.55లక్షల తలసరి ఆదాయమే లక్ష్యమని తెలిపారు. ‘సూపర్-6 సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అభివృద్ధి కార్యకలాపాలను పున:ప్రారంభించడంపై దృష్టిపెట్టాం. విధానాలు, వ్యయప్రాధాన్యతలలో కీలక సవరణలు చేశాం’ అని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ వివరించారు.

News February 11, 2026

ఆకాశంలో అద్భుతం.. ‘హృదయ’ కాంతిని చూడండి!

image

ప్రేమికుల రోజుకు ముందు ఆకాశంలో అద్భుతం జరిగింది. హృదయపు ఆకారంలో ఏర్పడిన నార్తర్న్ లైట్స్ కనువిందు చేస్తున్నాయి. వినీల ఆకాశంలో ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తున్న ‘హార్ట్’ను నార్వేలో క్రిస్టొఫర్ వెంజెన్ బంధించారు. శీతాకాలంలో ఆర్కిటిక్ సమీపంలో ఈ నార్తర్న్ లైట్స్ కనిపిస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే ఛార్జ్‌డ్ కణాలు ఆక్సిజన్, నైట్రోజన్‌తో ఢీకొన్నప్పుడు ఆకుపచ్చ, పింక్, ఎరుపు, నీలం రంగు కాంతులను వెదజల్లుతాయి.