News March 9, 2025
మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే రూ.50,000: టీడీపీ ఎంపీ

AP: మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆఫర్ ప్రకటించారు. మూడో సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50,000, మగబిడ్డకు జన్మనిస్తే ఆవును బహుమానంగా ఇస్తానని ఓ కార్యక్రమంలో తెలిపారు. ఎక్కువ పిల్లల్ని కనాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 10, 2025
ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://edcet.tgche.ac.in
News March 10, 2025
PHOTOS: ట్రోఫీతో క్రికెటర్లు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గి భారత జట్టు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ధోనీ సారథ్యంలో 2013లో గెలిచాక 2017లోనూ అవకాశం వచ్చినా ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ సారి వచ్చిన ఛాన్స్‌ను రోహిత్ సేన ఒడిసిపట్టుకుంది. హిట్ మ్యాన్ నాయకత్వంలో సమిష్టిగా రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా కప్పును అందుకుంది. ఈ క్రమంలో కప్పుతో క్రికెటర్లు ఫొటోలకు పోజులిచ్చారు.
News March 10, 2025
అధిష్ఠానం ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తా: అద్దంకి

TG: పార్టీ తనను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. అధిష్ఠానం ఏ బాధ్యత ఇచ్చిన సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. అందుకే తన పేరును ప్రకటించారని పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఎమ్మెల్యేగా పోటీ చేయని సంగతి తెలిసిందే.