News February 1, 2025
బడ్జెట్లో పోలవరానికి రూ.5,936 కోట్లు

AP: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సవరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో పోలవరానికి రూ.5,936 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మరో రూ.54 కోట్లు కేటాయించింది. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వను ఆమోదించింది.
Similar News
News March 6, 2025
జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర

కశ్మీర్లోని మహాశివుడి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచులింగం ఉండే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్ర తేదీలు విడుదలయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9తో ముగుస్తుంది. త్వరలోనే యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు.
News March 6, 2025
మ్యాచులో నిద్ర పోయాడు.. ఔట్ అయ్యాడు

పాకిస్థాన్ క్రికెటర్ సౌద్ షకీల్ అరుదైన రీతిలో ఔటయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిద్ర పోయి క్రీజులోకి రాకపోవడంతో ఆయన టైమ్డ్ అవుట్ అయ్యారు. పాకిస్థాన్ టెలివిజన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ జట్టు ఆటగాడు షకీల్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావాల్సి ఉంది. 3 నిమిషాలలోపు అతడు బ్యాటింగ్కు రాకపోవడంతో అంపైర్ ఔట్గా ప్రకటించారు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ సహా మొత్తం నలుగురు ఔటయ్యారు.
News March 6, 2025
భూములు అమ్మితేగానీ ప్రభుత్వం నడపలేరా?: KTR

TG: భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి సీఎం రేవంత్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని KTR విమర్శించారు. గచ్చిబౌలి పరిధిలో 400 <<15655774>>ఎకరాలను <<>>అమ్మి రూ.30వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలపై మండిపడ్డారు. ఈ భూములు అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ మాట మార్చారని దుయ్యబట్టారు. హైడ్రా, మూసీ పరిధిలో కూల్చివేతలతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని ఆరోపించారు.