News December 28, 2024
రూ.6,000 కోట్ల పోంజీ స్కామ్.. నిందితుడు అరెస్ట్

రూ.6వేల కోట్ల పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్‌ను సీఐడీ అరెస్టు చేసింది. గుజరాత్ మెహసానా జిల్లాలోని ఓ గ్రామంలో దాక్కున్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అయిన ఇతను బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి వేలాది మందిని మోసం చేశారు. కొన్ని నెలలుగా అతను సీఐడీకి దొరక్కుండా తిరుగుతున్నారు.
Similar News
News January 22, 2026
వంటింటి చిట్కాలు

* సమోసాల తయారీకి ఉపయోగించే పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించేటపుడు చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైనట్లు అనిపిస్తే స్పూన్ శనగపిండి కలపండి చాలు.
* ఓవెన్‌లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో.. బ్రెడ్‌తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్ గట్టిగా అవదు. మంచి రంగులో ఉంటుంది.
News January 22, 2026
గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు వాయిదా

TG: <<17820908>>గ్రూప్-1<<>> అభ్యర్థుల భవితవ్యంపై తీర్పును ఫిబ్రవరి 5కు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా తుదితీర్పునకు లోబడి నియామకాలు ఉండాలని పేర్కొంది. ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉండగా కాపీ రెడీ కాకపోవడంతో FEB 5న ఇవ్వనున్నట్లు పేర్కొంది.
News January 22, 2026
ఎస్.జానకి కుమారుడు కన్నుమూత

లెజెండరీ సింగర్ ఎస్.జానకి కుమారుడు మురళీ కృష్ణ(65) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర వెల్లడించారు. మురళీ మరణ వార్త షాక్‌కు గురి చేసిందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు సినిమాల్లోనూ నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


