News March 20, 2025
రూ.61 లక్షల వెహికల్ అలవెన్స్.. స్మితకు నోటీసులు?

IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ వెహికల్ అలవెన్స్ కోసం వర్సిటీ నుంచి నెలకు రూ.63వేలు తీసుకోవడంపై జయశంకర్ వర్సిటీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎంవో అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మితా 2016-24 వరకు రూ.61 లక్షలు అద్దె కింద తీసుకున్నట్లు తాజాగా ఆడిట్లో తేలింది. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె నుంచి డబ్బులు తిరిగి రాబట్టేందుకు త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
Similar News
News March 20, 2025
రాత్రి 7 గంటలలోపు ఈ పని చేస్తే?

రాత్రి 7 గంటలలోపు భోజనం చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 7 గంటలకు ముందే డిన్నర్ చేస్తే ఆయుర్దాయం 35 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. త్వరగా భోజనం చేస్తే జీర్ణం కావడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె జబ్బులు వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.
News March 20, 2025
నా టెంపర్మెంట్ ఏం మారలేదు: సీఎం రేవంత్

TG: తాను ముఖ్యమంత్రి అయినా 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి టెంపర్మెంట్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘2004లో ప్రజల్లోకి వచ్చాను. నేటికీ టెంపర్మెంట్లో ఛేంజ్ లేదు. సీఎంగా హుందాగా వ్యవహరించాలని కొంతమంది అంటుంటారు కానీ అలా వ్యవహరిస్తే అటువైపు అర్థం చేసుకునేవారు ఉండాలి కదా? టెంపర్మెంట్ పోతే న్యాయం చేయలేం. నా దూకుడు పోలేదు కానీ జ్ఞానం పెరిగింది’ అని తెలిపారు.
News March 20, 2025
ఆర్మీలోకి రూ.7వేల కోట్ల విలువైన ATAGS.. కేంద్రం ఆమోదం

భారత ఆర్మీ మరింత శక్తిమంతం కానుంది. రూ.7వేల కోట్ల విలువైన అత్యాధునిక టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ATAGS) కొనుగోలుకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తయారుచేయనున్న 307 ATAGSను భారత్ ఫోర్జ్, TASL సంస్థల నుంచి సైన్యం కొనుగోలు చేయనుంది. వీటికి 48 కి.మీ పరిధి ఉంటుంది. ట్రక్కులపై తరలించే మౌంటెడ్ గన్ సిస్టమ్స్ తరహాలో వీటిని తయారుచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.