News August 21, 2025

హైదరాబాద్ KPHBలో ఎకరం రూ.70 కోట్లు

image

TG: హైదరాబాద్‌లో KPHBలో హౌసింగ్ బోర్డు ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. ఈ వేలంలో రికార్డు స్థాయిలో ఎకరం భూమి రూ.70 కోట్లు పలికింది. మొత్తం 7.8 ఎకరాలకు రూ.547 కోట్ల ఆదాయం సమకూరింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ ఈ భూములను దక్కించుకుంది.

Similar News

News August 21, 2025

ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి!

image

TG: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మియాపూర్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా స్థానికులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారని ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 21, 2025

ర్యాపిడోకు రూ.10 లక్షల జరిమానా

image

క్యాష్ బ్యాక్, తక్కువ ధరకు రైడ్ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించారంటూ ర్యాపిడోకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ(CCPA) రూ.10 లక్షల ఫైన్ వేసింది. ‘5 నిమిషాల్లో ఆటో రాకపోతే రూ.50 పొందండి’ అంటూ తప్పుదోవ పట్టించారన్న ఫిర్యాదుపై చర్యలకు దిగింది. డబ్బులు రిటర్న్ ఇవ్వకపోగా కండిషన్స్ పేరుతో కాయిన్స్ ఇచ్చినట్లు గుర్తించింది. ఈ ప్రచారంతో ప్రభావితమైన వినియోగదారులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది.

News August 21, 2025

అందుకే సినిమాలు తగ్గించాను: సమంత

image

ఒకేసారి వరుస ప్రాజెక్టులు చేయకుండా ఫిజికల్, మెంటల్ హెల్త్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు హీరోయిన్ సమంత చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు సినిమాలు ఒకేసారి చేయలేనని, శరీరం స్పందనకు అనుగుణంగా వర్క్‌లోడ్ తగ్గించినట్లు పేర్కొన్నారు. అయితే పరిమాణం తగ్గినా క్వాలిటీ మాత్రం పెరిగిందని తెలిపారు. తెలుగులో ‘శుభం’లో మెరిసిన ఈ అమ్మడు, నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ సినిమా కమిట్ అయ్యారు.