News October 9, 2025

దీపావళి కానుకగా అకౌంట్లలోకి రూ.7వేలు?

image

AP: అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు(రూ.5వేలు) ఈ నెలలోనే జమయ్యే అవకాశాలున్నాయి. దీపావళి సందర్భంగా PM కిసాన్ 21వ విడత (రూ.2వేలు) రిలీజ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్ర సాయం(మొత్తం రూ.7వేలు) కూడా జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు Way2Newsకు తెలిపారు. ☛ రోజూ వ్యవసాయం, పాడి, ఇతర సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీలోకి వెళ్లండి.

Similar News

News October 9, 2025

ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి స్టే నిదర్శనం: కిషన్ రెడ్డి

image

TG: BC రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు లబ్ధి చేకూర్చాలని కాకుండా రాజకీయ ప్రయోజనం కోసం అసంబద్ధ బిల్లు, GO తీసుకొచ్చి డ్రామా చేస్తోందన్నారు. అటు ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని TBJP చీఫ్ రామ్‌చందర్‌రావు, MP ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే 50% పరిమితి పెట్టి ఇప్పుడు పెంపు అనడం CM అవగాహన లేమికి నిదర్శనమన్నారు.

News October 9, 2025

హైకోర్టు ఆదేశాలు పాటిస్తాం: ఎన్నికల సంఘం

image

స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సింగిల్ సెంటెన్స్‌తో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్‌పై న్యాయస్థానం స్టే విధించడంతో పాటు SEC కూడా దీనికి అంగీకరించడంతో ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేనట్లేనని స్పష్టమవుతోంది.

News October 9, 2025

జాన్సన్ & జాన్సన్‌కు రూ.8వేల కోట్ల జరిమానా!

image

ఫార్మా దిగ్గజం ‘జాన్సన్ & జాన్సన్’కు టాల్కమ్ పౌడర్ సంబంధిత కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్ వాడిన 88ఏళ్ల మే మూర్ 2021లో మెసోథెలియోమా అనే అరుదైన క్యాన్సర్‌తో చనిపోయారు. బాధితురాలి కుటుంబీకులు USA కోర్టుని ఆశ్రయించగా సుదీర్ఘ విచారణ తర్వాత కంపెనీకి $966 మిలియన్ల (రూ. 8,000 కోట్లు) భారీ జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై సంస్థ అప్పీల్‌కు వెళ్లనుంది. ఇప్పటికే సంస్థపై 63వేల కేసులు నమోదయ్యాయి.