News December 8, 2024
రామప్పకు రూ.73 కోట్ల నిధులు విడుదల

TG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.73 కోట్ల నిధులు కేటాయించింది. ఈమేరకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తూ జీవో జారీ చేసింది. కేంద్ర పథకం కింద స్థానికంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. కాటేజీలతో పాటు గార్డెన్, యాంఫీ థియేటర్, లేక్ వ్యూ కాటేజీలు, ఆట స్థలాలు, బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు.
Similar News
News March 15, 2026
ఇదే ఊపు కొనసాగుతుంది: రోహిత్ శర్మ

భారత క్రికెట్ గత రెండేళ్లుగా సాధిస్తున్న విజయాలపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో మహిళల జట్టు WC నెగ్గడం, ఇటీవల మెన్స్ T20 WCను కైవసం చేసుకోవడం అద్భుతమని కొనియాడారు. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడటం ఉండదు’ అని ధీమా వ్యక్తం చేశారు. పురుషుల, మహిళల జట్లు రెండూ ప్రస్తుతం ఫుల్ ‘మొమెంటం’లో ఉన్నాయని, ఇదే ఊపు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News March 15, 2026
బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ రూ.6,500

వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఆగట్లేదు. NDTV పలు రాష్ట్రాల్లో చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్యాస్ సిలిండర్‌కు ₹6,500, 14KGలు రీఫిల్ చేయడానికి ₹3,500-₹4K వరకు తీసుకుంటున్నారు. స్టవ్ రిపేర్ సెంటర్లు, కిరాణా దుకాణాల ద్వారా ఈ రాకెట్ నడుపుతున్నారు. ఏజెన్సీలే వీరికి బ్లాక్‌లో గ్యాస్ ఇస్తున్నట్లు తేలింది.
News March 15, 2026
ఏలూరు ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్: ఎస్పీ

TG: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌కు పాజిటివ్ వచ్చినట్లు ‘ఈగల్’ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. నిన్న యూరిన్ టెస్టు చేయగా <<19386182>>నెగటివ్<<>> వచ్చిందని, ఈరోజు టెస్టు చేయగా కొకైన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. FIRలో మొత్తం 11 మంది పేర్లను చేర్చారు.


