News September 10, 2024
పారాలింపిక్స్ ‘గోల్డ్’ విజేతలకు రూ.75 లక్షలు: మాండవీయ

పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సత్కరించారు. గోల్డ్ మెడలిస్టులకు ₹75 లక్షలు, సిల్వర్ విజేతలకు ₹50 లక్షలు, బ్రాంజ్ పతకాలు సాధించిన వారికి ₹30 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్‌లో రాణించిన ప్లేయర్లకు ₹22.50 లక్షలు అందజేస్తామని చెప్పారు. 2028 పారాలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు వీలుగా శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
Similar News
News November 24, 2025
తిరుపతి: తెలుగు, సంస్కృత అకాడమీ రెండయ్యేనా..?

రాయలసీమ ప్రాంతానికి తిరుపతిలో ఏకైక రాష్ట్ర కార్యాలయం తెలుగు, సంస్కృత అకాడమీ మాత్రమే. ఛైర్మన్ ఆర్డీ విల్సన్ తిరుపతి, విజయవాడ రెండు చోట్లా తెలుగు అకాడమీ, తిరుపతిలో సంస్కృత అకాడమీ అభివృద్ధి అంటున్నారు. తెలుగు, సంస్కృతం విడిపోతాయా? వివాదాస్పద నిర్ణయాలు అవసరమా? విద్యా కేంద్రమైన తిరుపతిలో అకాడమీ అభివృద్ధి చేయలేరా అన్న చర్చ ప్రస్తుతం నడుస్తుంది. దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి.
News November 24, 2025
స్మృతి పెళ్లి వాయిదా.. పలాశ్ సోదరి రిక్వెస్ట్!

టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడేందుకు వాళ్ల ఫాదర్ ఆరోగ్య పరిస్థితి కారణమని పలాశ్ ముచ్చల్ సోదరి పాలక్ ముచ్చల్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో తమ కుటుంబాల గోప్యతకు గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. నిన్న ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో పెళ్లి వాయిదా పడినట్లు మేనేజర్ తుహిన్ మిశ్రా ప్రకటించిన సంగతి తెలిసిందే.
News November 24, 2025
వన్డేలకు రెడీ అవుతున్న హిట్‌మ్యాన్

ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సిద్ధం అవుతున్నారు. గత 5, 6 రోజులుగా అతడు బెంగళూరు ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నారు. ఫిట్‌నెస్ పెంచుకోవడంతో పాటు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో స్పెషల్ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తాను జిమ్‌లో గడిపే ఫొటోలను రోహిత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.


