News November 28, 2024

రైతులకు రూ.7,500.. ఎప్పటినుంచంటే?

image

TG: వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి పంటకుగాను జనవరిలో ఎకరానికి రూ.7,500 చొప్పున అందించనుంది. ఈ మేరకు వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. గుట్టలు, కొండలు ఉన్న భూములతో పాటు స్థిరాస్తి వెంచర్లుగా మారిన ల్యాండ్‌కు రైతుభరోసా నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 15, 2025

రేపు విజయవాడకు CJI జస్టిస్ గవాయ్

image

AP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రేపు విజయవాడకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్, ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు.

News November 15, 2025

SAతో తొలి టెస్ట్.. భారత్‌కు మెరుగ్గా విన్నింగ్ ఛాన్స్!

image

సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సులో SA 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జడేజా 4, కుల్దీప్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో సఫారీలు ఉన్నారు. క్రీజులో బవుమా(29), బాష్(1) ఉన్నారు. రేపు మిగతా 3 వికెట్లను త్వరగా కూల్చేస్తే IND గెలుపు నల్లేరుపై నడకే.
* స్కోర్లు: SA.. 159/10, 93/7; భారత్ 189/10

News November 15, 2025

‘మా అమ్మ చనిపోయింది.. డబ్బుల్లేవని చెప్పినా దాడి చేశారు’

image

ఇటీవల మేడ్చల్ జిల్లాలో <<18258825>>హిజ్రాల<<>> దాడిలో గాయపడ్డ సదానందం కీలక విషయాలు వెల్లడించారు. ‘పాలు పొంగించేందుకు కొత్త ఇంటికి వచ్చాం. అది గృహప్రవేశం కాదు. హిజ్రాలు రూ.లక్ష డిమాండ్ చేశారు. తల్లి చనిపోయింది, డబ్బుల్లేవని చెప్పినా వినకుండా బూతులు తిట్టారు. బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపించారు. ఆ తర్వాత 15-20 మంది వచ్చి హంగామా చేస్తుంటే బెదిరించా. తిరిగి నాపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు’ అని తెలిపారు.