News October 16, 2024
త్వరలోనే వారికి రూ.7,500: మంత్రి తుమ్మల

TG: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500(ఏడాదికి ఎకరాకు రూ.15వేలు) ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.
Similar News
News March 12, 2025
ఆమె అరెస్ట్ నిర్బంధ పాలనకు పరాకాష్ఠ: KTR

TG: మహిళా జర్నలిస్ట్ రేవతిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఓ రైతు కష్టాల వీడియోను పోస్ట్ చేస్తే అరెస్ట్ చేయడం నిర్బంధ పాలనకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ప్రజాపాలనలో మీడియాకు స్వేచ్ఛ లేదని, రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని ప్రశ్నించారు. రేవతి అరెస్ట్‌ను హరీశ్ రావు కూడా ఖండించారు.
News March 12, 2025
సొంత నిధులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తా: మంత్రి లోకేశ్

AP: కడప జిల్లాలోని కాశీనాయన అన్నదాన సత్రం కూల్చివేతపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కూల్చివేయడం బాధాకరం. నిబంధనలు ఉన్నా భక్తుల మనోభావాలు గౌరవించి కూల్చకుండా ఉండాల్సింది. దీనిపై ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను’ అని ట్వీట్ చేశారు.
News March 12, 2025
పోసాని విడుదలకు బ్రేక్!

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.