News January 21, 2025
ఒకే చోట రూ.82 లక్షల కోట్లు

ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఒకే దగ్గర నిలబడ్డారు. ఈ నలుగురి నికర ఆదాయం $950 billion+గా ఉంది. అంటే అక్షరాలా రూ.82లక్షల కోట్లు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ $433 బిలియన్లతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు.
Similar News
News October 14, 2025
ఇంజినీరింగ్ విద్యార్థినులకు స్కాలర్షిప్

రూపా రాహుల్ బజాజ్ స్కాలర్షిప్ మహిళా విద్యార్థినులకు ఆర్థిక సహాయం, మెంటార్షిప్ అందిస్తోంది. ఇంటర్లో 75% మార్కులతో ఇంజినీరింగ్ చదువుతున్నవారు అర్హులు. మెకానికల్, ఎలక్ట్రికల్, ECE, ఇండస్ట్రియల్/ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్సెస్, మెటలర్జీ బ్రాంచులకు వర్తిస్తుంది. చివరి తేదీ: 31-10-2025. వెబ్సైట్: <
News October 14, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్‌ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <
News October 14, 2025
విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్.. మోదీ హర్షం

APలోని విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్ అవడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్, భారీ పెట్టుబడులు మన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం కానున్నాయి. AI, టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టూల్స్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తిమంతమైన ఆయుధంగా పనిచేయనుంది. డిజిటల్ ఎకానమీని పెంచుతూ గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత స్థానాన్ని సుస్థిరం చేయనుంది’ అని ట్వీట్ చేశారు.