News October 16, 2025
మామునూర్ ఎయిర్‌పోర్టుకు రూ.90 కోట్లు, అంగన్వాడీలకు రూ.156 కోట్లు

TG: వరంగల్ మామునూర్ విమానాశ్రయ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేసింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మొత్తం 949 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించారు. మరో 223 మంది రైతుల నుంచి 253 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పోషకాహార పథకం (SNP) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల కోసం అవసరమైన రూ.156 కోట్ల నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
Similar News
News October 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 17, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.16 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.53 గంటలకు
✒ ఇష: రాత్రి 7.06 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 17, 2025
శుభ సమయం (17-10-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ ఏకాదశి మ.1.08 వరకు
✒ నక్షత్రం: మఖ సా.4.38 వరకు
✒ శుభ సమయం: ఉ.10.00-10.30
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: శే.ఉ.6.08 వరకు, రా.12.52-2.30
✒ అమృత ఘడియలు: మ.3.00-మ.4.36 * ప్రతిరోజూ పంచాంగం, <<-1>>రాశిఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.