News February 3, 2025

APకి రూ.9,417కోట్లు, TGకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్

image

రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ‘తెలంగాణకు రూ.5,337cr, APకి రికార్డు స్థాయిలో రూ.9,417cr కేటాయించాం. తెలంగాణ వ్యాప్తంగా 1,326KM కవచ్ టెక్నాలజీ పని చేస్తోంది. APకి UPA హయాంలో కంటే 11రెట్లు ఎక్కువ కేటాయించాం. APలో 73రైల్వే‌స్టేషన్ల అభివృద్ధికి నిధులిచ్చి రూపురేఖలు మారుస్తున్నాం. రూ.8,455cr విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశాం’ అని అన్నారు.

Similar News

News November 17, 2025

MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

image

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్‌కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

News November 17, 2025

తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఫోన్ హ్యాక్

image

తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆమె మొబైల్ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌కి సందేశాలు పంపిస్తూ డబ్బులు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై భువన సుందరి స్పందిస్తూ.. తమ పేరుతో వచ్చే ఎలాంటి సందేశాలకు స్పందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు పంపించి ఎవరూ మోసపోవద్దన్నారు.

News November 17, 2025

జగిత్యాల: EVMల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

ధరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక వ్యవస్థలను ఈ సందర్భంగా ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.