News March 27, 2025
సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు

AP: బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52కోట్లు విడుదల చేసింది. స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద ఈ నిధులు విడుదల చేసినట్లు మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో సూర్యలంక బీచ్‌ను తీర్చిదిద్దుతాం. నిధులు విడుదల చేసిన కేంద్ర మంత్రి షెకావత్‌కు ధన్యవాదాలు. పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు’ అని మంత్రి వివరించారు.
Similar News
News February 3, 2026
మగవారిని బుట్టలో వేసుకోవడం ఎలా? క్లాసులు చెప్పి ₹కోట్లు గడించిన మహిళ!

చైనాకు చెందిన 47 ఏళ్ల జౌ యువాన్ అనే మహిళ Flirting పాఠాలు చెబుతూ ఏకంగా ₹31.5 కోట్ల ఆదాయం గడించారు. ‘గాడ్ మదర్ ఆఫ్ సెక్సువల్ ఇంటెలిజెన్స్’గా పేరొందిన ఆమె.. చూపులు, ఎక్స్ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్‌తో భర్తలను లేదా పార్ట్నర్లను ఎలా అట్రాక్ట్ చేయాలో చెబుతారు. ముఖ్యంగా ‘X-షేప్’ ఐ కాంటాక్ట్ వంటి ఆమె ట్రిక్స్ వైరలయ్యాయి. వేలాది మంది మహిళలు ₹లక్షలు ఖర్చు చేసి మరీ ఆమె వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారు.
News February 3, 2026
SBIలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 3, 2026
కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

TG: అనర్హత పిటిషన్‌పై విచారణకు హాజరు కావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీచేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. అలాగే కడియంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ అందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కూడా నోటీసులు పంపారు. విచారణకు హాజరుకావాలని సూచించారు.


