News March 17, 2025

రూ. లక్ష జీతంతో SBIలో ఉద్యోగాలు

image

రిటైల్ ప్రొడక్ట్స్ విభాగంలో 273 పోస్టుల భర్తీకి SBI దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ పోస్టులకు ఈ నెల 21, FLC కౌన్సెలర్/డైరెక్టర్ పోస్టులకు 26లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. MBA, PGDM, PGPM, MMS పాసై అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. sbi.co.inలో అప్లై చేయాలి. మేనేజర్‌కు రూ.85,920- రూ.1,05,280, FLC కౌన్సెలర్/డైరెక్టర్లకు రూ.50,000 ఇస్తారు.

Similar News

News October 19, 2025

Dhanteras: 50 వేల కార్లు డెలివరీ చేస్తున్న మారుతి సుజుకీ!

image

ధన్‌తేరాస్ సందర్భంగా రికార్డు స్థాయిలో 50 వేల కార్లను డెలివరీ చేస్తున్నట్లు మారుతి సుజుకీ తెలిపింది. శనివారం 41 వేల కార్లను కస్టమర్లకు అందజేశామని చెప్పింది. ఆదివారం మరో 10 వేలు డెలివరీ చేస్తామని, తద్వారా 51 వేల కార్ల రికార్డును అందుకునేందుకు ప్రయత్నిస్తామని సంస్థ SEO పార్థో బెనర్జీ తెలిపారు. కాగా ఈ ఏడాది ధన్‌తేరాస్ శనివారం మధ్యాహ్నం 12.18కి ప్రారంభమై, ఇవాళ మధ్యాహ్నం 1.51గం. దాకా కొనసాగనుంది.

News October 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 19, 2025

శుభ సమయం (19-10-2025) ఆదివారం

image

✒ తిథి: బహుళ త్రయోదశి మ.1.37 వరకు
✒ నక్షత్రం: ఉత్తర సా.6.03 వరకు
✒ శుభ సమయం: ఉ.8.30-ఉ.9.10
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: తె.3.28-ఉ.5.10
✒ అమృత ఘడియలు: ఉ.10.57-మ.12.37
✍️ రోజువారీ <<-se_10009>>పంచాంగం<<>>, <<-se_10008>>రాశి ఫలాలు<<>> కోసం క్లిక్ చేయండి.