News April 10, 2024
కాంగ్రెస్లోకి RS ప్రవీణ్ సోదరుడు?

TG: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ప్రసన్నకుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా తన ప్రత్యర్థి చల్లా వెంకట్రామిరెడ్డితో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ కావడంతో ప్రసన్నకుమార్ అలకబూనినట్లు టాక్. అందుకే తన సొంత అన్నతో విభేదించే పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 19, 2025
విష్ణు సహస్ర నామాలు ఎలా ఏర్పడ్డాయి?

భీష్ముడు అంపశయ్యపై తొలిసారిగా విష్ణు సహస్ర నామాలను స్తుతించాడు. ఇవి విష్ణుమూర్తి గొప్పతనాన్ని, ఆయన 1000 పేర్లను సూచిస్తాయి. అయితే కృష్ణుడి సలహాతో సహదేవుడు ఆ నామాలను మళ్లీమళ్లీ వినిపించేలా చేశాడు. అదే సమయంలో వ్యాసుడు వాటిని రాశాడు. ఈ నామాలను పఠించినవారికి ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెరుగుతుందని, వారిని భక్తి మార్గాన పయణించేలా చేస్తుందని నమ్మకం. ఆ నామాలు, వాటి భావాలను Way2News రోజూ మీకు అందిస్తుంది.
News November 19, 2025
వరికోత మిషన్ల కొరత.. రైతుల ఆందోళన

ఖమ్మం జిల్లాలో వరికోతల సమయంలో మిషన్ల కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా రైతులు వరికోతలు వాయిదా వేసుకున్నారు. దీంతో పంట పొలాలన్నీ ఒకేసారి కోతకు రావడంతో మిషన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట చేతికొచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు.
News November 19, 2025
మహబూబ్నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు

మహబూబ్నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.


