News June 15, 2024

రూ. 83 లక్షల జీతం వదులుకుని.. షెఫ్‌గా సెటిల్!

image

అమెరికాలోని సియాటెల్‌కు చెందిన వాలెరీ వాల్కోర్ట్(34) ఏడాదికి రూ.83 లక్షల జీతం సంపాదించేవారు. కానీ ఆత్మసంతృప్తి లేక ఆ కొలువు వదిలేసి ఫ్రాన్స్‌లో ఓ పేస్ట్రీ తయారీ షెఫ్‌కు సహాయకురాలిగా చేరిపోయారు. ఆమె కథ సియాటెల్‌లో చర్చనీయాంశంగా మారింది. లక్షల జీతం కంటే మనసుకు నచ్చిన పని చేయడమే తనకు బాగుందని, జీవితం సంతృప్తిగా ఉందని చెబుతున్నారు వాలెరీ. మరి మీరేమంటారు? జీతమా.. జీవితమా..?

Similar News

News September 13, 2025

‘మిరాయ్’ ఐడియా అప్పుడే పుట్టింది: దర్శకుడు కార్తీక్

image

‘మిరాయ్’ మూవీ ఐడియా 2015-16లో పుట్టిందని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. చనిపోయిన తన ఫ్రెండ్ అస్థికలు కలిపేందుకు రామేశ్వరం వెళ్తున్న సమయంలో కథకు బీజం పడిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గద్ద తనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్లు అనిపించిందని, అలా కథ పుట్టిందన్నారు. మిరాయ్ అనేది జపనీస్ పదమని, దానికి అర్థం ఫ్యూచర్ అని తెలిపారు. ఈ మూవీ కథ రాసేందుకు 5-8 ఏళ్లు పట్టిందన్నారు.

News September 13, 2025

వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: సత్యకుమార్

image

AP: చికిత్స విషయంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి డాక్టర్లు, సిబ్బందిపై కొందరు దాడి చేయడాన్ని మంత్రి సత్యకుమార్ ఖండించారు. వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘స్టాఫ్ వ్యవహారశైలిలో లోపాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. వారిపై దాడులు చేసి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. ఇది సరైంది కాదు’ అని Xలో పేర్కొన్నారు.

News September 13, 2025

షాకింగ్: HD క్వాలిటీతో ‘మిరాయ్’ పైరసీ!

image

కొత్త సినిమాలను పైరసీ బెడద వీడట్లేదు. నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘మిరాయ్’ సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మూవీ HD క్వాలిటీతో అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఇది దారుణమని, సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మేకర్స్ దీనిపై దృష్టి పెట్టి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.