News March 17, 2024
రూ. 41వేల కోట్లు తగ్గిన ఫ్లిప్కార్ట్ విలువ!

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ విలువ గత రెండేళ్లలో రూ. 41వేల మేర తగ్గింది. దాని మాతృసంస్థ వాల్మార్ట్ ఈక్విటీ వివరాల్లో ఈ విషయం వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం సంస్థ విలువ 40 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది జనవరికి అది 35 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ అంచనాలను ఫ్లిప్కార్ట్ తప్పుబట్టింది. తమ సంస్థ నుంచి ఫోన్ పే 2023లో వేరుపడినప్పటికీ.. ఆ సమాచారాన్ని వాల్మార్ట్ అప్డేట్ చేయలేదని వివరించింది.
Similar News
News November 1, 2025
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు: Dy.CM

TG రైజింగ్, రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు (DEC 1-9) నిర్వహించాలని Dy.CM భట్టి అన్నారు. భవిష్యత్తులో TG ఏం సాధించబోతుందనే విషయాలను ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలని సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. విజయోత్సవాలకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, భారీగా MOUలు జరిగేలా వాతావరణం ఉండాలన్నారు.
News November 1, 2025
ఢిల్లీలో నేటి నుంచి ఈ వాహనాలపై బ్యాన్

ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించిన నేపథ్యంలో నగరంలో రిజిస్టర్ కాని, BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని కమర్షియల్ వెహికల్స్పై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నిషేదం విధించింది. నేటి నుంచి వాటికి నగరంలోకి అనుమతి ఉండదు. దీని నుంచి BS-IV వాణిజ్య వాహనాలకు 2026, OCT 31 వరకు మినహాయించింది. ఢిల్లీ రిజిస్టర్డ్ కమర్షియల్ గూడ్స్ వెహికల్స్, BS-VI, CNG/LNG, ఎలక్ట్రికల్ కమర్షియల్ వాహనాలకు అనుమతి ఉంటుంది.
News November 1, 2025
నవంబర్ 1: చరిత్రలో ఈరోజు

1897: రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం (ఫొటోలో ఎడమవైపు)
1956: ఉమ్మడి ఏపీతో పాటు కేరళ, మైసూరు, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల ఆవిర్భావం
1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఏర్పాటు
1973: నటి, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ జననం
1974: భారత మాజీ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ జననం
1989: తెలుగు సినీ నటుడు హరనాథ్ మరణం


