News November 3, 2025
RSV ఇన్ఫెక్షన్‌ను ఎలా నివారించాలంటే?

వర్షాకాలం, చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లకూడదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు RSV ఇమ్యూనోగ్లోబ్యులిన్ వ్యాక్సిన్ ఇస్తారు. పిల్లల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. పిల్లలకు పోషకాలున్న ఆహారం ఎక్కువగా ఇవ్వాలి.
Similar News
News November 3, 2025
కరెంట్, రోడ్లు అడిగితే చనిపోతారని చెప్పేవాళ్లు: మోదీ

దశాబ్దాలపాటు బిహార్‌ను కష్టాల్లో ఉంచిందని ఆర్జేడీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘ఆ పార్టీకి అభివృద్ధి వ్యతిరేక చరిత్ర ఉంది. రోడ్లు నిర్మిస్తే ప్రమాదాలు జరుగుతాయని, కరెంటు సరఫరా చేస్తే షాక్‌కు గురై చనిపోతారని ప్రజలకు ఆర్జేడీ నాయకులు చెప్పేవాళ్లు’ అని విమర్శించారు. నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో సుపరిపాలన అందించామని, రాష్ట్రానికి వందే భారత్ రైళ్లు, రోడ్లు తీసుకొచ్చామని కటిహార్‌లో ఎన్నికల ప్రచారంలో అన్నారు.
News November 3, 2025
రూల్ బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ: మంత్రి పొన్నం

TG: ఇరుకు రోడ్డు కావడం, డివైడర్ లేకపోవడం వల్లే చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగిందని మంత్రి పొన్నం తెలిపారు. రవాణా శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ‘ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా కఠినంగా వ్యవహరిస్తేనే యాక్సిడెంట్లను నియంత్రించవచ్చు. వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతుందో చూడాలి. దాన్ని బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలి. ఫిట్‌నెస్ పర్మిట్లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.
News November 3, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

అక్టోబర్ 31న విడుదలైన ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా 3 రోజుల్లో రూ.38.9 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో ఇండియాలోనే రూ.27.9Cr వచ్చినట్లు పేర్కొన్నాయి. బాహుబలి పార్ట్-1, పార్ట్-2ను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే గ్రేటెస్ట్ ఫిల్మ్ అని, లైఫ్ టైమ్‌లో ఇలాంటి సినిమా ఒక్కసారే వస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


