News January 28, 2026

RTCలో 40 కోట్ల మంది ఉచిత ప్రయాణం: రాంప్రసాద్ రెడ్డి

image

AP: ‘స్త్రీ శక్తి’లో ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు, ట్రాన్స్‌జెండర్లకు ఎంతో మేలు చేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ‘వారి జీవితాల్లో ఇదో గొప్ప మార్పు. ఇప్పటివరకు వారు 40 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. మహిళా ప్రయాణికులు 40% నుంచి 63.4%కి పెరిగారు. డిమాండ్‌కు అనుగుణంగా 1,413 అదనపు ట్రిప్పులు, 64,647 అదనపు KM ఆపరేట్ చేస్తున్నాం. సబ్సిడీగా RTCకి ₹1,388 కోట్లు ఇచ్చాం’ అని చెప్పారు.

Similar News

News February 20, 2026

ఇండియాలో లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది: రషీద్ ఖాన్

image

T20 WCలో ప్రేక్షకుల మద్దతుకు అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇండియాలో మాకు లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీలో మ్యాచ్‌లకు భారీ సంఖ్యలో వచ్చారు. మేం అఫ్గాన్‌లో మా సొంత ప్రేక్షకుల ముందు ఆడుతున్నట్లు అనిపించింది. మైదానంలోనే కాదు.. ఎక్కడికెళ్లినా ప్రేమ లభించింది. మాకు మద్దతు కొనసాగించండి’ అని కెనడాతో మ్యాచ్ అనంతరం చెప్పారు.
స్కోర్లు: AFG:200/4, CAN: 118/8

News February 20, 2026

ఫిబ్రవరి 20: చరిత్రలో ఈ రోజు

image

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం (ఫొటోలో)
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

News February 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.