News March 18, 2025

RTC ఎండీ సజ్జనార్ క్రేజ్ ఇప్పుడు ఇంటన్నేషనల్

image

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ Say no to betting apps #Tag తర్వాత దేశ, విదేశాల్లో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. మీరు చెప్పేది నిజమే సర్ అంటూ లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. సజ్జనార్ ఇన్‌స్టాను 65 లక్షల మంది చూడగా X హ్యాండిల్‌ను 72 లక్షల మంది చూశారు. విదేశాల్లో మొరాకో, యూఎస్, యూఏఈ, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, కువైట్ దేశాల వాసుల నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తోంది.

Similar News

News October 20, 2025

రేపు ప్రజావాణి రద్దు: భద్రాద్రి కలెక్టర్

image

దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పండుగ సందర్భంగా జిల్లా అధికారులు ఉండరని, ఈ అంశాన్ని జిల్లా ప్రజలు గమనించి ఎవరు కూడా కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు

News October 20, 2025

తప్పిన పెను ప్రమాదం

image

బండి ఆత్మకూరు- పార్నపల్లె గ్రామాల మధ్య ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన విష్ణు, హెడ్ కానిస్టేబుల్ రమణ రావు కారులో వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

News October 20, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ట్విస్ట్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రకటన వచ్చినప్పటి నుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇపుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో ఎత్తుగడ వేసి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత చేత నామినేషన్ వేయించిన సంగతి తెలిసిందే. అయితే విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకవేళ సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే విష్ణు గులాబీ పార్టీ నుంచి బరిలో ఉంటాడు.