News July 15, 2024

RTC ఛైర్మన్‌గా డాక్టర్ వంశీకృష్ణ..?

image

అచ్చంపేట MLA వంశీ కృష్ణకు TG RTC ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆయన సీఎంకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. కేబినెట్‌లో అవకాశం లేకపోవడంతో ఆయనకు ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. NGKL పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఆయనకు అనుకూలంగా సీఎంకు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ముందే ప్రకటించే అవకాశం ఉందని టాక్.

Similar News

News October 14, 2025

HYD: Get Ready.. ఏర్పాట్లు పూర్తి: VC

image

పాలమూరు వర్శిటీలోని ఈనెల 16న 4వ స్నాతకోత్సవనికి ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్శిటీ ఉపకులపతి(VC) ఆచార్య జిఎన్ శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారని, వ్యాపారవేత్త ఎంఎస్ఎన్ రెడ్డి (Dr.మన్నే సత్యనారాయణ రెడ్డి)కి పాలమూరు వర్శిటీ (పీయూ) గౌరవ డాక్టరేట్ గవర్నర్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

News October 14, 2025

ఈ నెల 16న PU 4వ స్నాతకోత్సవ వేడుకలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ రానున్నారన్నారు. ఈ వేడుకల్లో 12 పీహెచ్‌డీలు, బంగారు పతకాలు ప్రదానం ఉంటుందన్నారు.

News October 13, 2025

MBNR: జాగ్రత్త.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మంగళవారం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి. ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.