News March 18, 2025
RTC ఎండీ సజ్జనార్ క్రేజ్ ఇప్పుడు ఇంటన్నేషనల్

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ Say no to betting apps #Tag తర్వాత దేశ, విదేశాల్లో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. మీరు చెప్పేది నిజమే సర్ అంటూ లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. సజ్జనార్ ఇన్‌స్టాను 65 లక్షల మంది చూడగా X హ్యాండిల్‌ను 72 లక్షల మంది చూశారు. విదేశాల్లో మొరాకో, యూఎస్, యూఏఈ, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, కువైట్ దేశాల వాసుల నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తోంది.
Similar News
News March 18, 2025
నంద్యాల జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా విజువల్ పోలీసింగ్: ఎస్పీ

నంద్యాల జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా విజువల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాలు చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News March 18, 2025
దేవనకొండ: శ్రీ గద్దరాల మారెమ్మవ్వ చరిత్ర

కర్నూలు జిల్లా దేవనకొండ మండల సమీపానికి 5 కిలోమీటర్ల దూరంలో కొండల్లో వెలిసిన శ్రీ గద్దరాల మారమ్మ అవ్వ మూడేళ్లకొకసారి జరిగే ఊరు దేవురా కుంభోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనున్న పల్లె దొడ్డి గ్రామం నుంచి 101 కుంభాలతో గద్దరాల మారెమ్మవా దేవాలయం చేరుకునే సమయంలో అమ్మవారు గద్ద రూపంలో దేవాలయం వెనకాల ఉన్న కొండపై వాలి వెళ్లిపోతుందని అక్కడి గ్రామస్థులు పురాణాలు చెబుతున్నారు.
News March 18, 2025
రేపు, ఎల్లుండి జాగ్రత్త

AP: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రేపు 58 మండలాల్లో, ఎల్లుండి 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని <