News October 7, 2025

గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ బస్సుల సమాచారం!

image

TG: బస్సుల సమాచారాన్ని ప్రయాణికులకు RTC మరింత చేరువ చేయనుంది. దీపావళి నుంచి బస్సుల వివరాలను గూగుల్ మ్యాప్స్‌ ద్వారా విడతలవారీగా ప్రయాణికులకు అందించాలని చూస్తోంది. దీంతో పాటు ‘మీ టికెట్’ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లు, QR ఆధారిత డిజిటల్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అటు మరో 3 నెలల్లో HYD పరిధిలో 275 EV బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

Similar News

News October 7, 2025

పైడితల్లి అమ్మవారి దివ్యగాథ

image

విజయనగరానికి రాజైన తన సోదరుడు విజయరామరాజును బొబ్బిలి యుద్ధానికి వెళ్లొద్దని పైడితల్లమ్మ ముందే చెబుతారు. కానీ ఆమె మాట వినక రాజు యుద్ధానికెళ్లి మరణిస్తాడు. ఈ కబురు తెలిసి అమ్మవారు కూడా తనువు చాలిస్తారు. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలోకి వచ్చిన అమ్మవారు తన ప్రతిరూపాలు లభించే స్థలాన్ని సూచిస్తారు. వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని చెబుతారు. ఆ విగ్రహాలు నిజంగానే లభ్యమవ్వగా, ఆలయాన్ని నిర్మించారు.

News October 7, 2025

టుడే అప్డేట్స్

image

* వాల్మీకి జయంతి.. చిత్రపటానికి పూలమాల వేసిన సీఎం చంద్రబాబు
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ జూమ్ మీటింగ్.. పాల్గొన్న మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్
* మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన TPCC చీఫ్ మహేశ్.. సంయమనం పాటించాలని సూచన
* మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

News October 7, 2025

గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలివే..

image

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ హార్ట్‌అటాక్ వస్తోంది. అయితే మహిళలకు ఈ ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. గుండెపోటు వచ్చే ముందు మహిళల్లో ఛాతీలో అసౌకర్యం, భుజాలు, వీపు, మెడ, దవడ ప్రాంతాల్లో నొప్పి, శ్వాస సరిగా ఆడకపోవడం, తలతిరగడం, చెమట ఎక్కువగాపట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. <<-se>>#WomenHealth<<>>