News November 16, 2024

నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు

image

AP: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ మండిపడింది. ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని డిపోలు, జోనల్ వర్క్‌షాపుల వద్ద నిరసనలు చేయనున్నట్లు ప్రకటించింది. కూటమి నేతలు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్, జీపీఎస్‌ స్థానంలో కొత్త పింఛన్ పథకాన్ని తీసుకురావాలనే డిమాండ్‌తో డిసెంబర్ 10న ఛలో విజయవాడ నిర్వహించనున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.

Similar News

News December 11, 2025

మోదీకి నెతన్యాహు ఫోన్

image

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఫోన్ చేశారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. గాజాలో శాంతి స్థాపనకు తమ సహకారం ఉంటుందని మోదీ పునరుద్ఘాటించారు.

News December 10, 2025

US వెళ్లేందుకు వారు ఐదేళ్ల SM హిస్టరీ ఇవ్వాలి!

image

UK సహా వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్లే వాళ్లు ఇకపై ఐదేళ్ల సోషల్ మీడియా హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. వీసా అవసరంలేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ రూల్ తప్పనిసరి చేసేలా US ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పుతో యూరప్, AUS, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, ఖతర్, ఇజ్రాయెల్ వంటి 40 దేశాలపై ప్రభావం పడుతుంది. సాధారణంగా ఈ దేశాల పౌరులు వీసా లేకుండా 90 డేస్ అమెరికాలో ఉండొచ్చు.

News December 10, 2025

చీకటి గదిలో ఫోన్ చూస్తున్నారా?

image

చాలామందికి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం అలవాటు. అలా చూడటం కళ్లకు మంచిది కాదని తెలిసినా ‘తప్పదు’ అని లైట్ తీసుకుంటారు. అయితే ఆ ‘లైట్’ ముఖ్యం అంటున్నారు వైద్యులు. గదిలోని అన్ని లైట్లు ఆర్పేసి చీకట్లో ఫోన్ చూడటం వల్ల దాని కాంతి నేరుగా కళ్లపై పడి అవి దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాత్రివేళ ఫోన్ చూసినప్పుడు తప్పనిసరిగా గదిలో వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.