News April 2, 2025
రేపట్నుంచి RTC ఉద్యోగుల నిరసనలు

AP: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ RTC ఉద్యోగులు నిరసనలకు పిలుపునిచ్చారు. రేపు, ఎల్లుండి ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. సస్పెన్షన్లు, తొలగింపు లేకుండా 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, వెంటనే పదోన్నతులు చేపట్టాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారానే కొనాలని, నైట్అవుట్ అలవెన్స్ ₹150 నుంచి ₹400 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News September 10, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నికలో 7 పార్టీల క్రాస్ ఓటింగ్?

ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్‌కు 15 మంది ఇండీ కూటమి MPలు క్రాస్ ఓటింగ్ చేశారని News18 వెల్లడించింది. ఈ మేరకు NDA వర్గాలు చెప్పాయంది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నుంచి ఐదుగురు, శివసేన(UBT) నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, DMK, JMM, RJD, NCP(SP)ల నుంచి ఒకరు చొప్పున క్రాస్ ఓటింగ్ చేసినట్లు పేర్కొంది. మరోవైపు NDA తమ MPలకు 2 రోజులు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంది.
News September 10, 2025
జగన్ వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ కౌంటర్

AP: మెడికల్ కాలేజీలపై జగన్ <<17624092>>వ్యాఖ్యలకు<<>> మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. తామేమీ మెడికల్ కాలేజీలు అమ్మడం లేదని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో ఎందుకు వాటిని పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందని వివరించారు. తెలియకపోతే సలహాదారులను అడిగి తెలుసుకోవాలని చురకలు అంటించారు. PPP వలన పేద విద్యార్థులకు నష్టం ఉండదని తెలిపారు.
News September 10, 2025
వరుస టాస్ ఓటములకు తెరదించిన టీమ్ ఇండియా

టీమ్ ఇండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. ఇవాళ ఆసియా కప్‌లో భాగంగా UAEతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ వరుస టాస్ ఓటములకు తెరదించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా 15 మ్యాచ్‌ల్లో IND టాస్ ఓడిన విషయం తెలిసిందే. 16వ మ్యాచ్‌లో ఈ స్ట్రీక్‌కు బ్రేక్ పడింది. అటు ఇవాళ్టి మ్యాచ్‌లో స్టార్ బౌలర్ అర్ష్‌దీప్‌కు చోటుదక్కలేదు. ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలని తనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.