News November 7, 2024
ఈ నెల 19, 20న ఆర్టీసీ ఈయూ నిరసనలు

AP: ఉద్యోగ భద్రత సర్క్యులర్ యథావిధిగా అమలు చేయడంతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నిరసనలు చేపట్టనుంది. ఈ నెల 19, 20న ప్రొటెస్ట్ చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని సూచించింది. ఆర్టీసీ డిపోలు, వర్క్ షాప్ల వద్ద ధర్నాలు చేయాలని ఉద్యోగులకు సూచించింది.
Similar News
News December 16, 2025
అమ్మాయిలకు మీసాలు.. కారణమిదే

కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిల్లా మీసాలు, గడ్డాలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. ఈ సమస్యను హిర్సుటిజం(Hirsutism) అంటారు. ఈ సమస్య PCOD, థైరాయిడ్ ఉన్నవారిలో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో చాలా తక్కువ మోతాదులో ఉండే మేల్ హార్మోన్స్ పెరగడం, కొన్నిరకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. సమస్యను గుర్తించగానే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>
News December 16, 2025
IIIT వడోదరలో ఉద్యోగాలు

IIIT వడోదర 7 ట్రైనింగ్& ప్లేస్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(మేనేజ్మెంట్/ ఇంజినీరింగ్/LAW), CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.56,100- రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్సైట్: iiitvadodara.ac.in
News December 16, 2025
టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: టెట్-2026 పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. జనవరి 3 నుంచి 20 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. 9 రోజుల్లో 15 సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి. రోజూ ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.


