News August 8, 2025
పండగ వేళ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు!

TG: రాఖీ పండగ వేళ ప్రత్యేక బస్సుల్లో RTC 30% వరకు ఛార్జీలు పెంచింది. అయితే పండగల సీజన్లో టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఉందని RTC అధికారులు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు ఇవాళ మహబూబాబాద్(D) తొర్రూర్ వెళ్లేందుకు HYD ఉప్పల్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కారు. టికెట్ ఒకరికి రూ.220 అయితే రూ.330(ఇద్దరికి రూ.660) వసూలు చేశారని వాపోయారు. మహిళలకు ఫ్రీ బస్సు కల్పించి పురుషులపై ఆ భారం మోపుతున్నారని మండిపడ్డారు.
Similar News
News August 8, 2025
ఆగస్టు 11న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు!

ఈ ఏడాది FEBలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు-2025ను కేంద్రం ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని అప్డేట్ చేసి ఆగస్టు 11న కొత్త బిల్లు తీసుకురానున్నట్లు సమాచారం. 1961 IT చట్టం స్థానంలో కొత్త బిల్లు తేవాలని FEBలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని సెలక్ట్ కమిటీకి పంపగా కొన్ని మార్పులు సూచించింది. వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకొని అప్డేట్ బిల్లు తెస్తున్నట్లు సమాచారం.
News August 8, 2025
‘కాంతార’ను వెంటాడుతున్న విషాదాలు

కాంతార మూవీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా పార్ట్ 1లో నటించిన <<17341034>>ప్రభాకర్ కళ్యాణ్<<>> మరణించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో ఈ చిత్రంలో నటించిన, నటిస్తున్న ఆర్టిస్టులు చనిపోవడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మేలో రాకేశ్ పూజారి(34), కపిల్(32), జూన్‌లో కళాభవన్(43), తాజాగా ప్రభాకర్ కళ్యాణ్ మరణించారు. కారణమేదైనా కాంతారను విషాదాలు వదలట్లేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
News August 8, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల తక్షణ సాయం!

రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు గోల్డెన్ అవర్‌లో తక్షణ చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5లక్షల వరకు నగదు రహిత చికిత్సను అందిస్తారు. ఈ చికిత్స గరిష్ఠంగా 7 రోజుల వరకు వర్తిస్తుంది. మోటార్ వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా ఈ పథకానికి అర్హులే. SHARE IT