News June 20, 2024
నెల రోజుల్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం: మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి
AP: మరో నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. ‘వైసీపీ హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. ఉన్న బస్సులనే యథావిధిగా కొనసాగించారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు కృషి చేస్తా. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులను కాపాడుకునే బాధ్యత మాపై ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 4, 2025
రూ.5,447 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం: టీడీపీ
AP: మార్చి 12న వైసీపీ తలపెట్టిన ‘ఫీజు పోరు’పై టీడీపీ Xలో ఫైరయ్యింది. గత ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్, చిక్కీలు, కోడిగుడ్లు, వసతి దీవెన కింద ₹5,447 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించింది. YS జగన్ విద్యార్థులు, వారి పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురి చేస్తే లోకేశ్ ₹800 కోట్లు విడుదల చేసి మనోధైర్యాన్ని నింపారని పేర్కొంది. YCP నేతలు ‘ఫీజు పోరు’ కలెక్టరేట్ల ముందు కాకుండా జగన్ యలహంక ప్యాలెస్ ముందు చేయాలంది.
News February 4, 2025
English Learning: Antonyms
✒ Guile× Honesty, frankness
✒ Grudge× Benevolence, Affection
✒ Genuine× Spurious
✒ Generosity× Stinginess, greed
✒ Glory× Shame, Disgrace
✒ Gloomy× Gay, Bright
✒ Harass× Assist, comfort
✒ Hamper× Promote, facilitate
✒ Hazard× Conviction, security
News February 4, 2025
‘భారత రత్న’ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన కొద్ది మందినే ఈ అవార్డు వరిస్తుంది. ఇప్పటివరకు 54 మందికి మాత్రమే ఈ అవార్డునిచ్చారు. అయితే, భారతరత్న పతకాన్ని స్వచ్ఛమైన రాగితో తయారుచేస్తారు. ఇది ఆకు ఆకారంలో, మధ్యలో వెండి రంగులో సూర్యుడి ఆకారపు అంచుతో ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా కోల్‌కతాలోని భారత ప్రభుత్వ మింట్‌లో రూపొందిస్తారు. ఇక్కడే ఇతర అవార్డులనూ తయారుచేస్తారు.