News July 13, 2024

త్వరలో వాట్సాప్‌లో RTC టికెట్లు!

image

TGSRTC బస్ టికెట్లను తన ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు వాట్సాప్‌ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో టికెట్లు వాట్సాప్‌లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే <<13612357>>యూపీఐ<<>> ద్వారా బస్సుల్లో టికెట్లు విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.

Similar News

News April 4, 2026

ఏప్రిల్ 6న ₹500కోట్ల ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

image

TG: ఈనెల 6న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ₹500కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ₹300కోట్ల వ్యయంతో చేపట్టనున్న బాసర సరస్వతి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో ₹200కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారు.

News April 4, 2026

బ్రహ్మాస్త్రం తయారీ.. ఉపయోగించే విధానం

image

వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను మెత్తగానూరి ముద్దలా తయారు చేయాలి. ఒక పాత్రలో 10 లీటర్ల ఆవు మూత్రం, ఆకుల ముద్దను వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి బాగా ఉడికించి పొయ్యి మీద నుంచి దించి.. 48 గంటల పాటు చల్లారనివ్వాలి. తర్వాత గుడ్డతో వడకడితే బ్రహ్మాస్త్రం సిద్ధమైనట్లే. ఎకరాకు 100 లీటర్ల నుంచి 2 లేదా రెండున్నర లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారీ చేయాలి. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.

News April 4, 2026

ఏ దేవుణ్ని ఏ సమయంలో పూజిస్తే మంచిది?

image

మన ఇష్ట దైవాన్ని ఏ సమయంలోనైనా పూజించవచ్చు. అయితే కొన్ని సమయాలు ఆయా దేవుళ్లకు అనుకూలంగా ఉంటాయని పండితులు అంటున్నారు. వాటి ప్రకారం.. సూర్యుడిని ఉదయం 6 గంటల లోపు పూజించాలి. అప్పుడే రాముడు, వేంకటేశ్వర స్వామిని పూజించవచ్చు. శివుడిని ఉదయం, సాయంత్రం 6 గంటల తర్వాత పూజిస్తే మంచి ఫలితం దక్కుతుంది. మధ్యాహ్నం వేళ హనుమంతుడిని పూజిస్తే ఆయన కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. లక్ష్మీదేవి పూజకు రాత్రి 6-9 అనువైన సమయం.