News June 3, 2024
RTV ఎగ్జిట్ పోల్స్.. చిత్తూరు జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లంటే?
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-9, YCP-4, జనసేన-1 సీటు గెలుస్తుందని తెలిపారు. తంబళ్లపల్లి, పీలేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం స్థానాల్లో TDP పాగా వేస్తుందని, సత్యవేడు, గంగాధరనెల్లూరు, మదనపల్లె, పుంగనూరులో YCP గెలిచే అవకాశం ఉందని, తిరుపతిలో జనసేన గెలుస్తుందని తెలిపారు.
Similar News
News December 29, 2024
చిత్తూరు కలెక్టరేట్లో రేపు గ్రివెన్స్ డే: కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్లో రేపు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం1 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News December 29, 2024
తిరుపతి: పరీక్షలు వాయిదా
తిరుపతి SV యునివర్సిటీ పరిధిలో జరుగుతున్న PG మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. ఈ నెల 30 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి 3వ తేదీకి మార్చినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని దామ్లా నాయక్ సూచించారు.
News December 29, 2024
కుప్పంలో ఫారెస్ట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
కుప్పం నియోజకవర్గంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కలపను అక్రమంగా తరలిస్తున్న పది వాహనాలను ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల కలప అక్రమ రవాణా జోరుగా సాగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.