News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్‌.. నెల్లూరు జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లంటే?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-5, YCP-5 సీట్లు గెలుస్తుందని తెలిపారు. కోవూరు, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి స్థానాల్లో TDP పాగా వేస్తుందని, నెల్లూరు రూరల్, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేటలో YCP గెలిచే అవకాశం ఉందన్నారు.

Similar News

News September 16, 2024

నెల్లూరు :ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

image

నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

News September 15, 2024

మనుబోలులో వినాయక ఉత్సవంలో అపశ్రుతి.. 30మందికి గాయాలు

image

మనుబోలు బీసీ కాలనీలో వినాయక ఉత్సవంలో ఇవాళ సాయంత్రం అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవం కోసం తెచ్చిన తారాజువ్వలపై నిప్పు రవ్వలు పడిన ఘటనలో సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

నెల్లూరు: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

image

వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గూడూరు మండలం చెన్నూరు గిరిజన కాలనీ వాసులు వినాయక విగ్రహాన్ని తూపిలిపాళెం సముద్రంలో నిమర్జనం చేసి తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా, క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.