News June 3, 2024
RTV సర్వే: ఉమ్మడి కృష్ణాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలుసా.!
ఉమ్మడి కృష్ణాలో TDP-8, YCP-6, JSP-1, BJP-1 చోట్ల గెలుస్తాయని RTV సర్వే తెలిపింది. VJA వెస్ట్-ఆసిఫ్, సెంట్రల్-ఉమా, ఈస్ట్-రామ్మోహన్, నందిగామ-జగన్, మైలవరం-కృష్ణప్రసాద్, తిరువూరు-స్వామిదాస్, జగ్గయ్యపేట-తాతయ్య, గుడివాడ-రాము, పెనమలూరు-బోడె ప్రసాద్, పామర్రు-అనిల్, గన్నవరం-వెంకట్రావు, పెడన- రాము, మచిలీపట్నం-రవీంద్ర, అవనిగడ్డ-బుద్దప్రసాద్, నూజివీడు-ప్రతాప్, కైకలూరు- కె.శ్రీనివాస్ గెలబోతున్నారని పేర్కొంది.
Similar News
News September 11, 2024
సుప్రీం కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి జోగి రమేశ్
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి జోగి రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధికారంలో ఉండగా జోగి రమేశ్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ మార్పిడి తర్వాత రమేశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
News September 11, 2024
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో మరో వ్యక్తి అరెస్టు
సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాలడుగు దుర్గాప్రసాద్‌ను మంగళగిరి పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. దుర్గాప్రసాద్ ఈ కేసులో ఏ4గా నిందితుడిగా ఉన్నాడు. దుర్గాప్రసాద్ కోసం కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులు.. ఇవాళ గుంటుపల్లిలో ఆయన ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా దుర్గాప్రసాద్ సతీమణి ఎంపీపీ పాలడుగు జోష్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
News September 11, 2024
పులిగడ్డ గురుకుల పాఠశాలను సందర్శించిన డీఎంహెచ్‌వో
అవనిగడ్డ మండలం పులిగడ్డలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో డీఎంహెచ్వో గీతాబాయి పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ కుమార్‌ను, వైద్యులు డా. ప్రభాకర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు జరిగిన పరీక్షల్లో మొత్తం 31 మంది జ్వర పీడితులు తేలారని, వారిలో ముగ్గురు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండగా, మరో ఆరుగురు చికిత్స కోసం ఇళ్లకు వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు.