News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్: ఉమ్మడి విశాఖలో జనసేన క్లీన్‌స్వీప్..!

image

ఉమ్మడి విశాఖలో 15 స్థానాల్లో TDP-8, YCP-2, జనసేన 4, BJP ఒక స్థానంలో విజయం సాధిస్తాయని RTV అంచనా వేసింది. అరకు, మాడుగలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలిపింది. విశాఖ నార్త్‌లో విష్ణుకుమార్ రాజు గెలుస్తారని అభిప్రాయ పడింది. జనసేన పోటీ చేసిన నాలుగు స్థానాలు పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్, యలమంచిలిలో జెండా ఎగువేస్తుందని అంచనా వేసింది. మిగిలిన 8 స్థానాల్లో TDP గెలుస్తుందని తెలిపింది.

Similar News

News February 18, 2026

విశాఖలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

image

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా నేవల్ ఎయిర్ స్టేషన్ (INS డేగా) వద్ద గవర్నర్ S.అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్, సీపీలు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.

News February 18, 2026

రేపు విశాఖలో పర్యటించనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

image

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల కార్యక్రమం మిలాన్–2026 ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు.నౌకాదళ ఉన్నతాధికారులతో సమావేశమై కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. సముద్రిక ఆడిటోరియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై దేశీయ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి పయనమవుతారు.

News February 18, 2026

విశాఖ సాగర్ తీరంలో జెట్ ఫైటర్ల విన్యాసాలు (వీడియో)

image

అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు విశాఖ సముద్రతీరంలో అద్భుత విన్యాసం చేశాయి. ఒకేసారి ఏడు జెట్ ఫైటర్లు సముద్రానికి దగ్గరగా వెళ్తూ పల్టీలు కొట్టడం, బాంబులు వదిలే విన్యాసాలు నిర్వహించారు. తీరానికి శత్రుదేశం నౌకలు ఏమైనా చేరుకుంటే వాటిని ఎలా పేల్చాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.