News June 3, 2024
RTV Survey: రాజధానిలో BRS ఓటమి!

తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey తాజాగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లలో BJP, హైదరాబాద్లో MIM పార్టీ గెలవబోతున్నట్లు RTV Survey పేర్కొంది. రాజధానిలో BRS ఖాతా తెరవదని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 14, 2025
Jubilee By-Election: రూల్స్ బ్రేక్ చేస్తే యాక్షన్: జాయింట్ CP

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో యూసుఫ్గూడ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ CP తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 14, 2025
BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో FULL EMERGENCY ప్రకటన

లండన్ నుంచి HYD వచ్చే BA 277 (STA 05:20) విమానానికి బాంబ్ బెదిరింపు కారణంగా ఈరోజు ఉదయం 4:46 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 5:10 గంటలకు 167 మంది ప్రయాణికులు, ఇద్దరు శిశువులు, ఇద్దరు కాక్పిట్ సిబ్బంది, 8 కేబిన్ సిబ్బందితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని ప్రస్తుతం ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీ చేస్తున్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: ఎవరు గెలిచినా విజయోత్సవాలకు నో పర్మిషన్!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుండగా కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. కాగా ఈ ఉపఎన్నికలో ఎవరు గెలిచినా విజయోత్సవాలకు పర్మిషన్ లేదని అధికారులు స్పష్టం చేశారు.


