News June 3, 2024
RTV Survey: NZB, ZHBలో BJP గెలుపు!
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey తాజాగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిజామాబాద్, జహీరాబాద్లో BJP గెలవబోతున్నట్లు RTV Survey పేర్కొంది. నిజామాబాద్, జహీరాబాద్లో కాంగ్రెస్, BRS ఖాతా తెరవదని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
Similar News
News January 15, 2025
కామారెడ్డి: చైనా మాంజా ఏం చేయలేదు
సంక్రాంతి పండగ సందర్భంగా ఎగరేసిన గాలిపటాల చైనా మాంజాలు ప్రజలకు తాకి జిల్లాలో పలువురి గొంతులు తెగాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కామారెడ్డి పట్టణ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బైక్లపై వెళ్లే వారు ప్రమాదాల బారిన పడకుండా ఐరన్ కేబుల్ని బండికి బిగిస్తున్నారు. దీంతో వారిని పలువురు అభినందిస్తున్నారు.
News January 15, 2025
డిచ్పల్లి: టీయూలో Ph.D అడ్మిషన్లకు నోటిఫికేషన్
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ లా తదితర విభాగాల్లో కేటగరి-1 Ph.D అడ్మిషన్లకు సంబంధిత డీన్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. యూజీసీ నెట్,CSIR నెట్ పరీక్షల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత సాధించిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సంప్రదించాలన్నారు.
News January 15, 2025
కనుమ ఎఫెక్ట్.. మటన్, చికెన్ షాపుల వద్ద ఫుల్ రష్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొన్న భోగి, నిన్న సంక్రాంతి జరుపుకున్న ప్రజలు నేడు మందు, మటన్, చికెన్ ముక్క వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో మటన్, చికెన్ షాపులకు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. దీంతో షాపులు పూర్తిగా రద్దీగా మారాయి. అటు నాటు కోళ్ల కు కూడా భారీగా డిమాండ్ పెరిగింది.