News June 3, 2024
RTV Survey: NZB, ZHBలో BJP గెలుపు!

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey తాజాగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిజామాబాద్, జహీరాబాద్‌లో BJP గెలవబోతున్నట్లు RTV Survey పేర్కొంది. నిజామాబాద్, జహీరాబాద్‌లో కాంగ్రెస్, BRS ఖాతా తెరవదని అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?
Similar News
News February 13, 2026
NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్‌లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్‌లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు.
News February 13, 2026
NZB: బీజేపీ మేయర్ అభ్యర్థి స్రవంతి రెడ్డి విజయం

నిజామాబాద్ నగరంలోని ఆరో డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి విజయం సాధించారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డి బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆరో డివిజన్ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థిపై మెజారిటీతో గెలుపొందారు. తనకు ఓటు వేసి గెలిపించిన వార్డు సభ్యులకు స్రవంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News February 13, 2026
ఆర్మూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా

ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 36 వార్డులకు 19 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీని సాధించడంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్: 19 వార్డులు
బీజేపీ: 7 వార్డులు
బీఆర్ఎస్: 5 వార్డులు
ఇతరులు/స్వతంత్రులు: 4 వార్డులు
MIM: 1
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గ చూపారు.


